Homeటాప్ స్టోరీస్వరుణ్ తేజ్ మూవీ ఫై మంచు విష్ణు కామెంట్స్ వైరల్

వరుణ్ తేజ్ మూవీ ఫై మంచు విష్ణు కామెంట్స్ వైరల్

manchu vishnu tweets to Ghani
manchu vishnu tweets to Ghani

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా సినిమా ఫై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. మాములుగా విష్ణు ఎప్పుడు కూడా ఏ సినిమా రిలీజ్ కు కూడా ట్విట్టర్ లో కామెంట్స్ చేయడం , స్పందించడం కానీ చేయడు. అలాంటిది వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ టైం లో చేయడం ఫై పలువురు పలు రకాలుగా కామెంట్స్ వేస్తున్నారు. మా ఎన్నికల తర్వాత మెగా – మంచు ఫ్యామిలీ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మా ఎన్నికల్లో నాగబాబు ప్రకాష్ రాజ్ టీమ్ కు సపోర్ట్ చేయడం మంచు ఫ్యామిలీ కి నచ్చలేదు. ఇక అప్పటి నుండి ఏదొక రకంగా నాగబాబు – మంచు ఫ్యామిలీ వ్యవహారం వార్తల్లో నిలుస్తుంది.

ఈ పరిస్థితుల్లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు స్వయంగా ట్వీట్ పెడుతూ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకోవడం చర్చల్లో నిలిచింది. విష్ణు చేసిన ఈ ట్వీట్ చూసి ‘మనసులో సినిమా ఫ్లాప్ కావాలని గట్టిగా కోరుకుతున్నావ్ కదా’ అని కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. దీంతో దీనిపై వెంటనే రియాక్ట్ అయిన మంచు విష్ణు.. ఎందుకు నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? పాజిటివ్‌గా ఆలోచించండి అని రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం గని చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ టాక్ వస్తుంది. మొత్తం మీద మంచు విష్ణు పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All