
సన్నీ లియోన్ ప్రస్తుతం మంచు విష్ణు సరసన గాలి నాగేశ్వరావు మూవీ లో నటిస్తుంది. సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ బ్రేక్ లో సన్నీ – విష్ణు రకరకాల ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విష్ణు – సన్నీ – బాలాజీ లు కలిసి ఫన్నీ గేమ్ ఆడారు. ఈ గేమ్ కు సంబంధించిన వీడియోను సన్నీలియోన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
గేమ్ లో భాగంగా అలా ముగ్గురు కూర్చొని ఉండగా మధ్యలో ఉన్న వ్యక్తు తన ఎడమ, కుడి ఉన్న వ్యక్తుల థైస్ ను కొడుతున్నాడు. మధ్యలో వ్యక్తి కొడుతుండగా మిగతా ఇద్దరు బాటిల్స్ తో ఆ వ్యక్తిని ఆపాలి. ఈ గేమ్ చూసి నెటిజన్లు ఇదేం ఆట అంటున్నారు. మరికొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Love this game!! pic.twitter.com/wyhr3wq5KV
— Sunny Leone (@SunnyLeone) April 15, 2022