Homeటాప్ స్టోరీస్‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు

‘గాలి నాగేశ్వరరావు’గా మంచు విష్ణు

Manchu Vishnu As Gaali Nageswara Rao
Manchu Vishnu As Gaali Nageswara Rao

కెరియర్ లో ‘ఢీ’ తప్ప మరో పెద్ద హిట్ లేని మంచు విష్ణు..ఓ భారీ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ మధ్యనే మా అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టిన విష్ణు..తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించి మంచు అభిమానులను సంతోష పరిచారు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘గాలి నాగేశ్వరరావు’ అనే సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేసారు.

ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.. కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా చోటా. కె.నాయుడు పనిచేస్తుండగా.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిసున్నారు. జి. నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ . ఇలా పెద్ద పెద్ద వారే ఈ సినిమా కు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక సినిమా కు సంబదించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలుపుతామని విష్ణు చెప్పుకొచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All