Homeటాప్ స్టోరీస్కల్లెక్షన్ కింగ్ వినాయక చవితి బహుమతి

కల్లెక్షన్ కింగ్ వినాయక చవితి బహుమతి

కల్లెక్షన్ కింగ్ వినాయక చవితి బహుమతి
కల్లెక్షన్ కింగ్ వినాయక చవితి బహుమతి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దైవ భక్తి ఎక్కువే. ఆయన  షిర్డీ సాయి సాయి బాబా కు అపరభక్తులు అన్న విషయం తెలిసిందే. ఏపని చేసినా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటుంటారు. అలాంటి మోహన్ బాబు ఈ వినాయక చవితికి వినూత్న ప్రయోగం చేస్తున్నారు. స్వతహాగా సాయి బాబా భక్తుడైన ఆయన ఈ వినాయక చవితికి ఓ వీడియోని రిలీజ్ చేస్తున్నారు.

తన గళం తో వినాయకచవితి పూజా విధానాన్ని అందించబోతున్నారు. మోహన్ బాబు గళం గురించి  ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాల్లో డైలాగులు చెప్పాలంటే మోహన్ బాబు తరువాతే ఎవరైనా. ప్రదానంగా చెప్పాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు తరువాత అనర్గళంగా డైలాగులు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మోహన్ బాబు ఒక్కరే .

 

అలాంటి మోహన్ బాబు గళంతో వినాయక చవితి పూజా విధానం కు సంబందించిన వీడియో విడుదల కాబోతోంది. వినాయక చవితి పండగకు ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 21న మంచు ఫ్యామిలీ ఈ వీడియోని రిలీజ్ చేయబోతోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All