Homeటాప్ స్టోరీస్మలయాళ 'బాహుబలి'.. కథ ఏమైంది?

మలయాళ ‘బాహుబలి’.. కథ ఏమైంది?

మలయాళ 'బాహుబలి'.. కథ ఏమైంది?
మలయాళ ‘బాహుబలి’.. కథ ఏమైంది?

బాహుబలి ఒక అబ్బురపరిచే విన్యాసం. దేశవ్యాప్తంగా గర్వించదగ్గ పరిణామం. ఈ చిత్రాన్ని చూసి ఎంత మంది అబ్బురపడ్డారో, అంతకు రెట్టింపు మంది అసూయ చెందారు. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఈ విషయంలో మరీనూ. అందుకే ఎవరికి వాళ్ళు బాహుబలిని తలదన్నే సినిమా తీయాలని కలలు కంటూనే ఉన్నారు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడా కూడా బాహుబలి లాంటి విజయం కాదు కదా దాని దరిదాపులోకి వచ్చే చిత్రం కూడా లేకపోవడం విశేషమే. హిందీ ఈ విషయంలో ముందుంది. ఇప్పటికే చాలా సినిమాలు బాహుబలిని టార్గెట్ చేస్తూ వచ్చాయి. మొన్నటి పానిపట్ నుండి పద్మావత్ మొదలుగొని ఎన్నో సినిమాలు బాహుబలి రేంజ్ ను తాకుదామని ప్రయత్నించాయి. కన్నడ నుండి కెజిఎఫ్ వచ్చినా దాని జోనర్ వేరు. సుదీప్ పహిల్వాన్ అంటూ ప్యాన్ ఇండియా సినిమానే చేసాడు. అది తుస్సుమంది. విజయ్ కూడా తమిళం నుండి ఒక సినిమా చేసాడు, దాని అడ్రెస్ గల్లంతైంది. ప్రస్తుతం మరో సినిమా తీసే ఆలోచనలో ఉన్నారు తమిళ్ వాళ్ళు. కన్నడ నుండి కూడా బాహుబలి టైప్ సినిమా ఒకటి విడుదలైంది. అదే మమ్ముట్టి హీరోగా వచ్చిన మామాంగం.

కేరళ ప్రాచీన యుద్ధ కళల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రోమోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కేరళ మార్కెట్ చిన్నది కాబట్టి బాహుబలి రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఆశించలేం కానీ ప్రమాణాల పరంగా బాహుబలిని అందుకునే స్థాయి ఉంటుందేమోనని ఆశించారు. అయితే అటువంటి సీన్ ఈ చిత్రానికి లేదని తేలిపోయింది. మామాంగం, మలయాళంతో పాటు చాలా భాషల్లోనే విడుదలైంది. స్వయంగా మమ్ముట్టి హైదరాబాద్ వచ్చి ఈ చిత్రాన్ని ప్రచారం చేసారు. అయితే తెలుగులో ఈ చిత్రం విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలీదు. తెలుగు మీడియాలో చాలా కొన్ని సంస్థలు తప్ప వేరేవి రివ్యూలు కూడా రాయలేదు.

- Advertisement -

ఇక చిత్రం పరంగా చూస్తే మామాంగం ఒక బోరింగ్ సినిమా అంటున్నారు. మమ్ముట్టి రేంజ్ ఉన్నప్పటికీ, కొన్ని సీన్లు అలరించినప్పటికీ సినిమాలో బోరింగ్ సన్నివేశాలే ఎక్కువ ఉన్నాయిట. మొత్తంగా మామాంగం ఫెయిల్ ప్రాజెక్ట్ అనే సంగతి తేలిపోయింది. మళయాళంలోనే ఈ చిత్రానికి స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఇక తమిళ, తెలుగు, హిందీ భాషల సంగతి చెప్పేదేముంది. మొత్తానికి మరో చిత్రం బాహుబలిని టార్గెట్ చేసి ఫెయిల్ అయిందన్న మాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All