
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా శనివారం రోడ్డు ప్రమాదానికి గురైంది. పుణేలో ఓ ఈవెంట్ వెళ్లి తిరిగి వస్తుండగా..ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద తాను ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రమాణిస్తోన్న కారుని బలంగా తాకాయని తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో మలైకా కారు ముందుభాగం డ్యామేజ్ అయింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మలైకాను హుటాహుటిన నేవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు మరికొన్ని పరీక్షలు నిర్వహించి, అన్ని బాగానే ఉంటే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. మలైకా ప్రమాదానికి గురైందనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ ని షాక్ కు గురి చేసాయి. ప్రస్తుతం ఈమె ఆరోగ్యంగానే ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.