Homeటాప్ స్టోరీస్అర్జున్ క‌పూర్‌ని మలైకా పెళ్లిచేసుకోబోతోందా?

అర్జున్ క‌పూర్‌ని మలైకా పెళ్లిచేసుకోబోతోందా?

అర్జున్ క‌పూర్‌ని మలైకా పెళ్లిచేసుకోబోతోందా?
అర్జున్ క‌పూర్‌ని మలైకా పెళ్లిచేసుకోబోతోందా?

మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి 2017 సంవత్సరంలో విడిపోయిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి వివాహం 1998 సంవత్సరంలో జ‌రిగింది. తొమ్మిదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది.  ఆ త‌రువాతే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి. గొడ‌వ‌లు ప‌తాక స్థాయికి చేర‌డంతో అర్బాజ్ నుండి విడాకులు తీసుకుంది మ‌లైకా. ఆ తరువాతే మలైకాకు బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ కపూర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. గ‌త కొంత కాలంగా ఇద్ద‌రూ క‌లిసి డేటింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ వీరిద్దరు క‌లిసి ఒకే ఇంట్లో వున్నారు. ఈ విష‌యం బాలీవుడ్ మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూ వ‌చ్చింది. బాలీవుడ్‌లో హాట్ క‌పుల్ గా నిలిచిన ఈ జోడీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల గోవాకు వెళ్లి ఒక ప్రైవేట్ విల్లాలో న్యూ ఇయర్ బాష్ ని ఆనందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేశాయి. దీంతో వీరు మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

- Advertisement -

గ‌త కొన్ని నెలుల‌గా వీరి డేటింగ్ కొన‌సాగుతోంది. అయితే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని మ‌లైకా అభిమానులతో పాటు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా వార్త‌ల ప్ర‌కారం అర్జున్ కపూర్, మలైకా అరోరా ఈ సంవత్సరం వేసవిలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నార‌ట‌. పూర్తి ప్రైవేట్ వెడ్డింగ్‌గా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ని, దీనికి ఎవ‌రికీ అనుమ‌తి వుండ‌ద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All