Homeటాప్ స్టోరీస్మజిలీ వీకెండ్ కలెక్షన్స్

మజిలీ వీకెండ్ కలెక్షన్స్

అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది మజిలీ చిత్రం . అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న నాగచైతన్య కు మజిలీ హిట్ ఒయాసిస్ లా అయ్యింది . పెళ్ళికి ముందు నాగచైతన్య – సమంత మూడు చిత్రాల్లో నటించగా మనం , ఏ మాయ చేసావే పెద్ద హిట్స్ అయ్యాయి . ఇక పెళ్లయ్యాక చేసిన ఈ మజిలీ కూడా పెద్ద హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొదటి రోజున 7 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసిన మజిలీ మూడు రోజుల్లో 17. 91 కోట్ల షేర్ ని వసూల్ చేసింది . దాంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు .

- Advertisement -

 

 

మజిలీ 3 రోజుల షేర్ ఏరియాల వారీగా ఇలా ఉంది

నైజాం – 5. 65 కోట్లు

సీడెడ్ – 1. 95 కోట్లు

ఉత్తరాంధ్ర – 1. 94 కోట్లు

కృష్ణా – 1 కోటి

గుంటూరు – 1. 22 కోట్లు

ఈస్ట్ – 86 లక్షలు

వెస్ట్ – 65 లక్షలు

నెల్లూరు – 39 లక్షలు

కర్ణాటక – 1. 05 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 25 కోట్లు

ఓవర్ సీస్ – 95 లక్షలు

మొత్తం – 17. 91 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All