
బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి షో ఎలా నిర్వహించాలన్నది డిసైడ్ చేస్తుంటారు. ఎవరిని ఉంచితే షోకి లాభం, ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని షోను నడిపిస్తారు. అయితే ఈసారి బిగ్ బాస్ షోలో కావాలని కొంత మందిని సేఫ్ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
శివజ్యోతి, అలీ, వితికలు అసలు ఎక్కువగా నామినేషన్స్ లోకి రాలేదు. అలీ నామినేషన్స్ లోకి వచ్చిన ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ మళ్ళీ వైల్డ్ కార్డు పేరిట షోలో తిరిగి ఎంటర్ అయ్యాడు. ఇక శివజ్యోతి అయితే బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ వల్ల వరసగా రెండు వారాలు నామినేట్ అయింది, మళ్ళీ ఇంత వరకూ నామినేట్ కాలేదు. వితిక ఐదు వారాల నుండి నామినేషన్స్ లోనే లేదు.
ఈసారి వచ్చినా తన దగ్గర మేడాలియన్ ఉన్న కారణంగా ఇమ్మ్యూనిటి వచ్చింది. ఈ రకంగా ఎప్పుడూ వీళ్ళే సేఫ్ అవుతుండడంతో ఎంతసేపూ రాహుల్, మహేష్ లే నామినేషన్స్ లో ఉంటున్నారు. మహేష్ అయితే కెప్టెన్ గా ఉన్న వారం తప్పిస్తే గత ఐదారు వారాల్లో ప్రతివారం నామినేషన్స్ లో ఉంటున్నాడు. రాహుల్ పరిస్థితి కూడా అంతే. అందరూ నామినేషన్స్ రుచి చూడకపోవడంతో బిగ్ బాస్ మీద ఆసక్తి సన్నగిల్లుతోంది.