Homeటాప్ స్టోరీస్మందు పార్టీ చేసుకున్న మహేష్ ఎన్టీఆర్ చరణ్

మందు పార్టీ చేసుకున్న మహేష్ ఎన్టీఆర్ చరణ్

mahesh ntr and charan party at star hotelనిన్న రాత్రి ఫుల్లుగా మందు పార్టీ చేసుకున్నారు అగ్ర హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , చరణ్ లు . నిన్న మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే . ఆ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా హాజరయ్యాడు అయితే ఇదే వేడుకకు చరణ్ కూడా రానున్నాడు అని తొలుత వార్తలు వచ్చాయి కానీ తీరా సమయానికి ఎన్టీఆర్ ఒక్కడే ముఖ్య అథితి అని ప్రకటించారు చిత్ర బృందం ,

కట్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చరణ్ రాలేదు కానీ ఓ స్టార్ హోటల్ లో జరిగిన మందు పార్టీ కి మాత్రం చరణ్ వచ్చాడు . ఈవెంట్ అంతా అయిపోయాక కొంతమంది ముఖ్యలకు స్టార్ హోటల్ లో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు నిర్మాత డివివి దానయ్య . మందు పార్టీలో పాల్గొని ఫోటోలకు ఫోజిచ్చారు మహేష్ , ఎన్టీఆర్ , చరణ్ లు . ముగ్గురు అగ్ర హీరోలు కలిసి మందు పార్టీ చేసుకోవడం , ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All