Homeగాసిప్స్సూప‌ర్‌స్టార్‌ కూడా బుల్లితెర‌పైకి?

సూప‌ర్‌స్టార్‌ కూడా బుల్లితెర‌పైకి?

సూప‌ర్‌స్టార్‌ కూడా బుల్లితెర‌పైకి?
సూప‌ర్‌స్టార్‌ కూడా బుల్లితెర‌పైకి?

నార్త్ టు సౌత్‌కు చెందిన స్టార్ హీరోలంతా బుల్లితెర‌పైకి వ‌చ్చేస్తున్నారు. గేమ్ షోల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఈ సంప్ర‌దాయం స‌ల్మాన్‌ఖాన్ నుంచి మొద‌లై ద‌క్షిణాదికి పాకింది. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి, బిగ్‌బాస్ … ఇలాంటి షోల‌తో స్టార్‌లు బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు. తెలుగులో నాగార్జున ఈ త‌ర‌హా షోల‌కు నాంది ప‌లికిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ జాబితాలోకి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఎంట‌ర‌వుతున్నార‌ని తెలిసింది. ఇటీవ‌ల బిగ్‌బాస్ సీజ‌న్ త్రి షో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో హల్‌చ‌ల్ చేసింది. ఈ సీజ‌న్‌లో పాల్గొన్న వాళ్ల‌ల్లో అత్య‌ధిక శాతం మంది సెల‌బ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తున్నారు. త్వ‌ర‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షోకు హోస్ట్‌గా ఈ సారి నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఆ స్థానంలో ప్రిన్స్ మ‌హేష్ ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌బోతున్నార‌ని జూలై నుంచి ఈ షో సీజ‌న్ 4 ప్రారంభం కానుంద‌ని తెలిసింది. దీని కోసం మ‌హేష్‌కు పారితోషికం కింద భారీగానే అంద‌జేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇనిషియ‌ల్ టాక్స్ న‌డుస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి మ‌హేష్ ఓకే చెబుతాడా? లేదా అన్న‌ది తెలియాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All