Homeటాప్ స్టోరీస్ఇద్దరు మహేష్ బాబు అభిమానుల మృతి

ఇద్దరు మహేష్ బాబు అభిమానుల మృతి

మహర్షి సినిమా చూసి నవ్వుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహేష్ బాబు అభిమానులు చిరకాల మిత్రులు చనిపోవడంతో మిర్యాలగూడ పట్టణం సమీపంలోని మిట్ట తండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి . గురువారం రోజు రాత్రి సెకండ్ షోకి మిర్యాలగూడ పట్టణంలోని ఓ ధియేటర్ లో మహర్షి సినిమా చూసిన ఇద్దరు మిత్రులు కేతావత్ రూప్ సింగ్ (20) కేతావత్ గోపాల్ నాయక్ (20) లు అర్ధరాత్రి మిర్యాలగూడ నుండి తమ గ్రామానికి బైక్ పై వెళ్తున్నారు .

- Advertisement -

అయితే సడెన్ గా ఓ గేదె అడ్డురావడంతో బైక్ అదుపుతప్పడంతో కేతావత్ రూప్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు . కేతావత్ గోపాల్ నాయక్ కు తీవ్ర గాయాలు కాగా అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు . ఇద్దరు ప్రాణస్నేహితులు అందునా మహేష్ బాబు అభిమానులు ఒకే సంఘటనలో చనిపోవడంతో మిర్యాలగూడ పట్టణంలో విషాధచాయలు అలుముకున్నాయి . మహేష్ బాబు ఫ్యాన్స్ ఇద్దరి మృతికి తేమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All