Homeటాప్ స్టోరీస్మీ నిస్వార్థ సేవ‌కు..అంకిత‌భావానికి సెల్యూట్‌!

మీ నిస్వార్థ సేవ‌కు..అంకిత‌భావానికి సెల్యూట్‌!

మీ నిస్వార్థ సేవ‌కు..అంకిత‌భావానికి సెల్యూట్‌!
మీ నిస్వార్థ సేవ‌కు..అంకిత‌భావానికి సెల్యూట్‌!

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డంతో భాగంగా కేంద్ర యుద్ధ ప్రాతిప‌దిక‌న దేశ ప్ర‌జ‌ల క్షేమం కోసం 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించింది. దీంతో దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారికి కొంత మేర అడ్డుక‌ట్ట వేశారు. దీని వెన‌క ప్ర‌భుత్వాల కృషితో పాటు వైద్ ఆరోగ్య సంస్థ విభాగానికి చెందిన వైద్యులు, న‌ర్సల కృషితో పాటు పోలీసుల అవిశ్రాంత శ్ర‌మ కూడా వుంది. పారిశుద్య కార్మికులు కూడా ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ధైర్యంగా తమ విధుల్ని నిర్వ‌ర్తిస్తూ న‌గ‌రాల్ని, గ్రామాల్ని సుర‌క్షితంగా వుండేలా శుభ్రం చేస్తున్నారు.

ఈ యుద్దంలో ప్ర‌ధానంగా పోలీసుల పాత్ర ప్ర‌శంస‌నీయం. నిత్యం డ్యూటీ చేస్తూ ఇళ్ల‌కి వెళ్ల‌కుండా రోడ్డుపైనే ప‌డుకుని సేల‌వ‌లు అందిస్తున్నారు. ఇందులో హృద‌య‌విదార‌క స‌న్నివేశం ఏంటంటే ఇంటికి వెళ్లిన పిల్ల‌లని ఆప్యాయంగా ద‌గ్గ‌రికి తీసుకోలేని ప‌రిస్థితి వారిది. ప్ర‌జారోగ్యం కోసం దేశం కోసం త్యాగాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగానికి సెల్యూట్ అంటున్నారు స్టార్ హీరో మ‌హేష్‌.

- Advertisement -

ఈ అస్య‌త‌వ‌స‌ర స‌వాల్‌తో కూడుకున్న స‌మయంలో మ‌న జీవితాల‌ను మ‌రియు మా కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నందుకు వారికివే నా అపాక కృత‌జ్ఞ‌త‌లు. మా దేశం ప‌ట్ల మీ నిస్వార్థ అంకిత భావానికి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. క‌నోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న యుద్దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న తెలంగాణ పోలీసు బ‌ల‌గాల‌కు హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల‌నుకుంటున్నాను. వారి నిస్వార్థ సేవ‌కు నా సెల్యూట్ ` అన్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All