Homeటాప్ స్టోరీస్సరికొత్త రికార్డ్ సృష్టించిన మహేష్

సరికొత్త రికార్డ్ సృష్టించిన మహేష్

YouTube video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను టీజర్ తో సరికొత్త రికార్డ్ ని సృష్టించాడు . ఇంతకుముందు ఈ రికార్డ్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పేరిట ఉండేది అయితే ఆ రికార్డ్ ని మహేష్ బద్దలు కొట్టి సంచలనం సృష్టించాడు . మార్చి 6న భరత్ అనే నేను టీజర్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే . సందేశాత్మకంగా ఉండటంతో పాటు మహేష్ సరికొత్తగా కనిపిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది దాంతో రికార్డుల మోత మోగుతోంది .

 

- Advertisement -

కోటి 32 లక్షలకు పైగా వ్యూస్ ని సాధించిన భరత్ అనే నేను టీజర్ కి అత్యధికంగా 5 లక్షల 26 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి . లైక్స్ విషయంలో ఇప్పటివరకు మహేష్ భరత్ అనే నేను దే రికార్డ్ . సినిమా రిలీజ్ కి ముందే ప్రకంపనలు సృష్టిస్తుండటం తో రేపు రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆత్రుత నెలకొంది అభిమానుల్లో . మహేష్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All