Homeటాప్ స్టోరీస్మ‌హేష్‌భ‌ట్ - రియా వాట్సాప్ చాట్ లీక్‌!

మ‌హేష్‌భ‌ట్ – రియా వాట్సాప్ చాట్ లీక్‌!

మ‌హేష్‌భ‌ట్ - రియా వాట్సాప్ చాట్ లీక్‌!
మ‌హేష్‌భ‌ట్ – రియా వాట్సాప్ చాట్ లీక్‌!

సుశాంత్ రాజ్ పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గ‌డుస్తున్నా కొద్దీ సుశాంత్ కేసులో భ‌యంక‌ర‌మైన నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. సుశాంత్ సింగ్ కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని ప్ర‌పంచం మొత్తం అనుమానిస్తున్న విష‌యం తెలిసిందే. రియాతో పాటు మ‌హేష్‌భ‌ట్‌ని కూడా కీల‌క స‌స్పెక్ట్‌గా భావిస్తున్నారు. ఈ అనుమానం నిజ‌మంటూ తాజాగా మహేష్ భ‌ట్, రియాల మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

సుశాంత్‌తో బ్రేక‌ప్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ మ‌హేష్ భ‌ట్ , రియాల మ‌ధ్య సాగిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. రియాని సుశాంత్ నుంచి వేరు చేయ‌డం కోసం మ‌హేష్ భ‌ట్ త‌న చాక చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. త‌న‌ని బంధ‌నాల నుంచి విముక్తిరాలిని చేశార‌ని రియా స్పందించ‌గా గ‌తాన్ని వ‌దిలి వేయ‌మ‌ని మ‌హేష్ భ‌ట్ చెప్ప‌డం, దానికి స‌మాధానంగా మీ మాట‌లు న‌న్నెంత‌గానో ప్ర‌భావితం చేశాయ‌ని, మీ ప్రేమ నా మ‌న‌సు లోతుల్లోకి వెళ్లింద‌ని రియా రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వాట్సాప్ చాట్ ని బ‌ట్టి చూస్తే రియా ప్రతీ విష‌యాన్ని మ‌హేష్ భ‌ట్‌తో షేర్ చేసుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

- Advertisement -

మ‌హేష్ భ‌ట్‌తో రియా క‌లిసి అత్యంత స‌న్నిహితంగా వున్న ఫొటోల‌ని బ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తోంద‌ని ఇంత‌కు ముందు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. తాజాగా అదే నిజ‌మ‌నే సంకేతాల్ని వాట్సాప్ చాట్ క్లారిటీ ఇవ్వ‌డంతో దేశం మొత్తం నివ్వెర‌పోతోంది. ‌సీబీఐకి సుశాంత్ కేసు బ‌దిలీ అయిన వెంట‌నే సీబీఐ ముంబైలో అడుగుపెట్టింది. ఆ వెంట‌నే కీల‌క‌మైన‌ వాట్సాప్ చాట్ బ‌య‌టికి రావ‌డం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All