
మెగాస్టార్ చిరంజీవి కి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట సాయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మాట సాయం అంటే దేనికో అనుకోకండి..చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి మహేష్ మాట సాయం అందించబోతున్నాడు. మహేష్ బాబు – రామ్ చరణ్ ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే సంగతి తెలిసిందే. చిరంజీవి అంటే అపారమైన గౌరవం చూపించే మహేష్.. చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఆదరాభిమానాలు చూపించుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలో చిరు-చరణ్ లు కలిసి కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్యా మూవీ చేశారు. ఈ మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనే డైరెక్టర్ కొరటాల శివ ప్రతిపాదనకు సూపర్ స్టార్ వెంటనే అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మహేష్ తో వాయిస్ రికార్డింగ్ పూర్తి చేసేయొచ్చని అంటున్నారు. ఇక కొరటాల – మహేష్ కలయికలో ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.