Homeటాప్ స్టోరీస్రైతు బిడ్డ గా మహేష్ బాబు

రైతు బిడ్డ గా మహేష్ బాబు

mahesh babu -vamsi paidipally new movie raithu biddaటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . మొదటి షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో ప్లాన్ చేసారు దర్శకులు వంశీ పైడిపల్లి . అగ్ర నిర్మాతలు అశ్వనీదత్దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ గెటప్ డిఫరెంట్ గా ఉంది . ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ కోర మీసాన్ని పెంచాడు అంతేకాదు గుబురు గడ్డం ని కూడా పెంచాడు . ఇక ఈ చిత్రానికి ” రైతు బిడ్డ ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట ఆ చిత్ర బృందం .

రైతు సమస్యల పై కృష్ణ పలు చిత్రాలు చేసాడు అలాగే పలు సూపర్ హిట్ లను అందుకున్నాడు కట్ చేస్తే ఇన్నాళ్లకు మహేష్ రైతు బిడ్డ గా రైతు సమస్యలపై ఓ చిత్రం చేస్తున్నట్లు అది కూడా రాయలసీమ నేపథ్యంలో అని తెలుస్తోంది . ఇటీవలే భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన మహేష్ బాబు ఆ సినిమా ఇచ్చిన విజయంతో చాలా సంతోషంగా ఉన్నాడు . ఇక ఇప్పుడు ” రైతు బిడ్డ ” గా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో అన్న ఆసక్తి నెలకొంది . ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ పై చిత్ర బృందం స్పష్టత నివ్వాల్సి ఉంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All