Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇదేనా

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇదేనా

mahesh babu vamsi paidipalli movie title rajasam భరత్ అనే నేను చిత్రంతో ఇటీవలే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు . తాజాగా 25 వ సినిమాకు రెడీ అవుతున్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మించ నున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం అధిక భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది . కాగా ఈ చిత్రానికి ” రాజసం ” అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి .

మీసం మెలితిప్పడమే కాకుండా కాస్త గుబురు గడ్డంతో మహేష్ బాబు కనిపించనున్నట్లు సమాచారం దాంతో కోర మీసం తో పాటు గడ్డంతో ఉన్న మహేష్ లుక్ ని అలాగే టైటిల్ ని విడుదల చేసారు మహేష్ బాబు అభిమానులు . లోగో యాజిటీజ్ గా ఉండకపోయినా టైటిల్ విషయంలో మాత్రం రాజసం అనే వినబడుతోంది . అయితే మహేష్ 25 వ సినిమా కు ఇదే టైటిల్ పెడుతున్నారా ? లేదా ? అన్నది మాత్రం ఆ యూనిట్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రం కోసం వంశీ పైడిపల్లి ఆశగా ఎదురు చూస్తున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All