Homeటాప్ స్టోరీస్మహేష్ కోసం భారీ ఇంటి సెట్ ను వేయిస్తున్న త్రివిక్రమ్

మహేష్ కోసం భారీ ఇంటి సెట్ ను వేయిస్తున్న త్రివిక్రమ్

mahesh babu trivikram movie update
mahesh babu trivikram movie update

మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ తాలూకా పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకోగా..జూన్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్రివిక్రమ్ కూడా ఈ మూవీ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలతో పాటు ఓ భారీ ఇంటి సెట్ ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడట. త్రివిక్రమ్ సినిమా అంటే భారీ సెంట్టింగ్ లు ఉంటాయి.

అత్తారింటికి దారేది సినిమాలో అత్త ఇంటి సెట్టింగ్ ను అత్యంత భారీగా వేయించాడు. అల వైకుంఠపురంలో సినిమా కోసం కూడా టబు ఇంటి సెట్టింగ్ ను భారీగా వేయించాడు. ఇక ఇప్పుడు మహేష్ కోసం అలాంటి భారీ సెట్ వేయిస్తున్నాడట. సినిమాలో మెజార్టీ సన్నివేశాలు ఆ సెట్టింగ్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అందుకే మహేష్ బాబు అభిరుచికి తగ్గట్లుగా.. ఆయన స్టార్ డమ్ కు తగ్గట్లుగా ఈ సెట్టింగ్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించాడని సమాచారం. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై చినబాబు నిర్మిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All