Homeటాప్ స్టోరీస్షేన్ వార్న్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మహేష్ బాబు

షేన్ వార్న్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మహేష్ బాబు

mahesh babu reacts on shane warne dies
mahesh babu reacts on shane warne dies

ఆస్ట్రేలియన్‌ క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ గుండెపోటు తో శుక్రవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే. షేర్ వార్న మరణ వార్త కేవలం క్రికెట్ అభిమానులకు , క్రికెట్ ఆటగాళ్లకు కాదు సినీ ప్రముఖులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. షేర్ వార్న్ ఏంటి చనిపోవడం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

క్రికెట్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు షేన్ వార్న్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసారు. షేన్ వార్న్ మరణ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో షాకింగ్‌గా ఉంది. క్రికెట్ ప్రపంచానికి ఇదొక దుర్దినం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. రాడ్నీ మార్ష్, షేన్ వార్న్ మీ ఇద్దరినీ ఎప్పటికీ మిస్ అవుతుంటాం.. అని మహేష్ బాబు ట్వీట్ వేశాడు. అలాగే మహేష్ తో పాటు సమంత సైతం తన ఇన్ స్టా స్టోరీలో షేన్ వార్న్ మృతి పట్ల స్పందించింది. రిప్ లెజెండ్ అని పోస్ట్ వేసింది.

- Advertisement -

షేన్ వార్న్ వయసు 52 . థాయ్‌లాండ్‌ లోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన అతని సిబ్బంది వెంటనే హాస్పటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్దారించారు. షేన్​వార్న్​ ఆస్ట్రేలియా తరఫున 45 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వార్న్ అరంగేట్ర సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మరో టైటిల్ గెలవలేదు. 2011 వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా కొనసాగిన వార్న్..ఆ తర్వాత మెంటార్‌గా కూడా సేవలందించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షేన్ వార్న్.. క్రికెట్ మ్యాచ్‌లపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All