Homeటాప్ స్టోరీస్మహర్షి లుక్ విడుదల : ఫ్యాన్స్ కేకో కేక

మహర్షి లుక్ విడుదల : ఫ్యాన్స్ కేకో కేక

mahesh babu maharshi look goes viralటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు కావడంతో మహేష్ బాబు లుక్ తో పాటు కొత్త సినిమా టైటిల్ ని కూడా రిలీజ్ చేసారు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తాజాగా తన 25 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు రిషి అనే టైటిల్ పెట్టబోతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు దాంతో మహేష్ ఫ్యాన్స్ భయపడిపోయారు ఎందుకంటే రెండక్షరాల టైటిల్ తో వచ్చిన మహేష్ సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి దాంతోనా ?లేక మరో కారణమో కానీ ఎట్టకేలకు ” మహర్షి ” అనే టైటిల్ ని ప్రకటించారు .

మహేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన స్టిల్ లో మహేష్ లుక్ చాలా బాగుంది దాంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అంతేలేకుండా పోయింది . సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు . మహర్షి పోస్టర్ తో పాటు ఇతర ఫోటోలను షేర్ చేస్తూ , ట్వీట్ చేస్తూ పెద్ద పండగే చేసుకుంటున్నారు . ఇటీవలే భరత్ అనే నేను చిత్రంతో సంచలన విజయం అందుకున్న మహేష్ తాజాగా మహర్షి చిత్రంతో బిజీ గా ఉన్నాడు . ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: mahesh babu maharshi look goes viral

mahesh babu maharshi look goes viral

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All