Homeగాసిప్స్సూపర్ స్టార్ దగ్గరికి సైరా డైరక్టర్...

సూపర్ స్టార్ దగ్గరికి సైరా డైరక్టర్…

సూపర్ స్టార్ దగ్గరికి సైరా డైరక్టర్...
సూపర్ స్టార్ దగ్గరికి సైరా డైరక్టర్…

యాక్షన్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా సినిమాతో అయితే అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా లాభాలను అందించలేకపోయింది. ఇక మెగాస్టార్ రిలీజ్ తరువాత కూడా ఓపిక ఉన్నంత వరకు ప్రమోషన్స్ చేసి వేరే సినిమాను మొదలుపెట్టారు.

అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం ఇంకా తన తదుపరి సినిమాను ఎనౌన్స్ చేయలేదు. ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. మొన్నటివరకు పలు రకాల రూమర్స్ అయితే గట్టిగానే వచ్చాయి. సైరా ఇంటర్వ్యూలలో మాత్రం సురేందర్ రెడ్డి ఇంకా ఎలాంటి సినిమా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యాక్షన్ డైరెక్టర్ మహేష్ బాబుకి ఒక లైన్ చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

మహేష్ కూడా సానుకూలంగా స్పందించడంతో వెంటనే స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ సినిమా తరువాత వంశీ పైడిపల్లితో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి నేమ్ కూడా వినబడుతుండడంతో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All