Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు ని ఆ హీరోయిన్ ముంచుతుందా ?

మహేష్ బాబు ని ఆ హీరోయిన్ ముంచుతుందా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మహేష్ బాబు సరసన నటిస్తోంది . పూజా హెగ్డే ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా సాలిడ్ హిట్ లేదు . తెలుగులో అలాగే హిందీలో ఈ భామ పలు చిత్రాల్లో నటించింది . అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం , ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రాల్లో నటించింది . అయితే అవి సాలిడ్ హిట్స్ కావు , బయ్యర్లకు నష్టాలు తెచ్చిన చిత్రాలు కావడం గమనార్హం . 
 
ఇక వీటితో పాటుగా ఒక లైలా కోసం , ముకుంద , సాక్ష్యం చిత్రాల్లో నటించింది ఇవి కూడా ప్లాప్ చిత్రాలు . అంటే తెలుగులో ఇప్పటివరకు పూజా హెగ్డే కు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు . దాంతో మహర్షి చిత్రంతో మహేష్ బాబు ని ముంచుతుందా ? లేక సాలిడ్ హిట్ ని ఇస్తుందా ? అన్న టెన్షన్ నెలకొంది మహేష్ అభిమానుల్లో . మే 9 న మహర్షి చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆరోజు తేలిపోనుంది పూజా హెగ్డే మహేష్ ని ముంచుతుందా ? లేదా ? అన్నది . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All