Homeటాప్ స్టోరీస్యుద్ధం ప్రకటించిన మహేష్ బాబు ఫ్యాన్స్

యుద్ధం ప్రకటించిన మహేష్ బాబు ఫ్యాన్స్

mahesh babu fans fires on tamil actorమహేష్ బాబుకు యాక్టింగ్ రాదని ఘోరంగా అవమానించిన తమిళ నటుడు మనోజ్ ప్రభాకర్ పై మహేష్ బాబు అభిమానులు యుద్ధం ప్రకటించారు . తమిళ మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబుకు యాక్టింగ్ రాదని , ఎస్ జె సూర్య స్పైడర్ చిత్రంలో అద్భుతంగా నటిస్తుంటే దానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలీక మహేష్ ఇబ్బందిపడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు మనోజ్ ప్రభాకర్ . అసలు తమిళ్ లో ఈ నటుడు పెద్దగా ఎవరికీ తెలీదు ఓ జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు అయితే ఎవరిపైన అయినా విమర్శలు చేస్తే ఈజీగా మీడియాలో నానుతాడు కాబట్టి మహేష్ బాబుపై కామెంట్ చేసాడు వార్తల్లో నిలిచాడు .

తమ అభిమాన హీరోని ఘోరంగా అవమానించిన మనోజ్ ప్రభాకర్ ని ఉపేక్షించేది లేదంటూ అతడ్ని బూతులు తిడుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . ఒకరకంగా మనోజ్ ప్రభాకర్ పై యుద్ధం ప్రకటించారు మహేష్ ఫ్యాన్స్ . మహేష్ బాబు తమిళంలో స్పైడర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందింది , కానీ ఎస్ జె సూర్య కు మాత్రం చాలామంచి పేరు వచ్చింది విలన్ గా . మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అయ్యింది . అయితే తమిళంలో నేరుగా చేసిన సినిమా కాబట్టి అంతటి దారుణమైన కామెంట్ చేసాడు మనోజ్ ప్రభాకర్ అనే జూనియర్ ఆర్టిస్ట్ .

- Advertisement -

English Title: mahesh babu fans fires on tamil actor

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All