Homeటాప్ స్టోరీస్మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరింది!

మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరింది!

మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరింది!
మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరింది!

ఈ మ‌ధ్య మ‌న స్టార్‌లు త‌మ‌కు న‌చ్చిన సినిమా గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మామా అల్లుళ్లు విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిచిన చిత్రం `వెంకీమామ‌`. ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజు తొలి ఆట నుంచే మౌత్ టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ని సాధిస్తూ విజ‌య‌ప‌థంలో దూసుకుపోతోంది. ఈ సినిమాపై సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స్పందించారు.

`సినిమాలో మామా అల్లుళ్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. `వెంకీమామ‌` ఓ చ‌క్క‌టి వినోదాత్మ‌క చిత్రం. ప్ర‌తీ బిట్‌ని ఎంజాయ్ చేశా. మామా అల్లుళ్ల కెమిప్ట్రీలో వెండి తెర‌ను మెరిపించారు. ప‌ర్‌ఫెక్ట్ ఎమోష‌న్స్‌, కామెడీ, కుటుంబ విలువ‌ల‌తో కూడుకున్న చిత్ర‌మిది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందాన్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాను అని ట్వీట్ చేశారు. దీనిపై రాశీఖ‌న్నా, నాగ‌చైత‌న్య స్పందించారు. మీరు మా సినిమా న‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు మ‌హేష్‌బాబు అని తెలిపారు.

- Advertisement -

తొలిసారి మామా అల్లుళ్లు అయిన వెంకీ, చై క‌లిసి న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమా ప్రారంభం నుంచే మంచి క్రేజ్ ఏర్పిడింది. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్ర వ‌సూళ్లు వుండ‌టంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్య‌క్తం చేస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్‌. ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాశిఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌లుగా న‌టించారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All