Homeగాసిప్స్మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి పాన్ ఇండియా సినిమానా?

మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి పాన్ ఇండియా సినిమానా?

మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి పాన్ ఇండియా సినిమానా?
మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి పాన్ ఇండియా సినిమానా?

సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు మ‌హేష్‌. ఈ సినిమా రిలీజ్ త‌రువాత మూడు నెల‌ల విశ్రాంతి తీసుకుని ఆ త‌రువాత కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. `స‌రిలేరు.. త‌రువాత మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లితో ఓ భారీ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుకుంది.

మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రీసెంట్‌గా `మ‌హ‌ర్షి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ రావ‌డంతో ఈ కాంబినేష‌న్‌పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో హాలీవుడ్ ఫిల్మ్ త‌ర‌హాలో ఈ చిత్రాన్ని టెక్నిక‌ల్‌గా హైస్టాండ‌ర్స్‌లో నిర్మించ‌బోతున్నార‌ట‌. సినిమాలో మ‌హేష్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మహేష్ డ్యుయెల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -

ర‌జ‌నీకాంత్ `భాషా` త‌ర‌హాలో సినిమా వుంటుంద‌ని, ఇందులో మ‌హేష్‌కు జోడీగా మెయిన్ హీరోయిన్‌గా కియారా అద్వానీనీ ఫైన‌ల్ చేయాల‌ని భావిస్తున్నారు. మ‌రో నాయిక‌గా కాజ‌ల్‌ అగ‌ర్వాల్ లేదా నిధి అగ‌ర్వాల్‌
న‌టించే అవ‌కాశం వుంది. మ‌హేష్ న‌టిస్తున్న 27వ చిత్రం కావ‌డం, వంశీ పైడిప‌ల్లితో మ‌హేష్‌ది హిట్ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాపై న‌మ్ర‌త భారీ హోప్స్ పెట్ట‌కున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All