Homeటాప్ స్టోరీస్వైరల్ అవుతున్న మహానటి డిలీటెడ్ సీన్స్

వైరల్ అవుతున్న మహానటి డిలీటెడ్ సీన్స్

mahanati deleted scenes goes viral in youtubeమహానటి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పై మొదట పెద్దగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే విడుదల సమయం దగ్గర పడిందో అప్పటి నుండి కాస్త అంచనాలు పెరుగుతూ వచ్చాయి కట్ చేస్తే …… సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది . దాంతో భారీ వసూళ్ల ని సాధిస్తూ వైజయంతి మూవీస్ బ్యానర్ వేల్యూ ని పెంచడమే కాకుండా పట్టరాని సంతోషాన్ని కూడా అందిస్తోంది .

ఇక ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో రిలీజ్ కి ముందు పలు సన్నివేశాలను తొలగించారు . రిలీజ్ నాటికే దాదాపు మూడు గంటల నిడివి ఉంది సినిమా దాంతో చేసిది లేక చాలా సన్నివేశాలను మహానటి చిత్రం లోంచి తొలగించారు . కట్ చేస్తే ఇప్పుడు మహానటి ప్రభంజనం సృష్టిస్తుండటంతో డిలీటెడ్ సీన్స్ అన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు . ఇక ఆ సన్నివేశాలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది . మహానటి డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి . క్లాసికల్ గా నిలిచిపోయిన సినిమా కావడంతో ఆ మహానటి లోని మరిన్ని సన్నివేశాలను చూడాలని ఆతృతగా ఉన్నారు నెటిజన్లు అందుకే డిలీటెడ్ సీన్స్ కి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts