Homeటాప్ స్టోరీస్మహాకూటమి తొలివిజయం ఖాయం

మహాకూటమి తొలివిజయం ఖాయం

Mahakutami will gets power with nandamuri suhasini మహా కూటమి తరుపున కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని వల్ల మహా కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని , తొలివిజయం కూకట్ పల్లి నుండి సుహాసిని సాధిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది . గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు కి 99,874 ఓట్లు వచ్చాయి . అదే స్థానం నుండి టిఆర్ ఎస్ పోటీ చేయగా కేవలం 56,688 ఓట్లు మాత్రమే వచ్చాయి దాంతో తెలుగుదేశం అభ్యర్ధి 43 , 186 ఓట్ల మెజారిటీ తో గెలిచాడు . కట్ చేస్తే పరిస్తితులు మారిపోవడంతో టిఆర్ ఎస్ పార్టీలో చేరాడు మాధవరం కృష్ణారావు . తెలుగుదేశం పార్టీ కి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంక్ ఏంటి ? దాని సత్తా ఏంటి ? అన్నది గత ఎన్నికల్లోనే చాటి చెప్పింది దాంతో తిరుగులేని స్థానం నుండి నందమూరి సుహాసిని ని పోటీకి నిలబెట్టారు చంద్రబాబు .

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలకు పూర్తిస్థాయిలో విశ్వాసం కలిగించలేకపోయాడు కేసిఆర్ . ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో చంద్రబాబు ని విమర్శిస్తే అర్ధం ఉంటుంది కానీ నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు కూడా చంద్రబాబు పై విమర్శలు చేయడంతోనే కేసిఆర్ తన ఓటిమి ని అంగీకరించినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కూకట్ పల్లి నుండి నందమూరి సుహాసిని భారీ మెజారిటీ తో విజయం సాధించడం ఖాయమని తద్వారా మహాకుటమి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ – తెలుగుదేశం వర్గాలు .

- Advertisement -

English Title: Mahakutami will gets power with nandamuri suhasini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All