Homeటాప్ స్టోరీస్మహా సముద్రం : రివ్యూ

మహా సముద్రం : రివ్యూ

Maha Samudram Review RatingMaha Samudram Review Rating
 

Rx 100 అజయ్ భూపతి డైరక్షన్ లో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్ధార్థ్) ఇద్దరు చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. అర్జున్ ఎప్పుడూ గొడవలకు రెడీగా ఉంటాడు. కాని తాను ఎస్సై అయ్యేంతవరకు గొడవలకు వెళ్లకూడదు అని అనుకుంటాడు విజయ్. అర్జున్.. స్మిత (అను ఇమ్మాన్యుయెల్) తో విజయ్ మహా అదితి రావు హైదరితో లవ్ లో పడతారు. అయితే మాఫిదా డాన్ ధనుంజయ్ తో మహా కి ఇబ్బంది కలుగుతుంది. ఆ టైం లో విజయ్ వైజాగ్ వైజాగ్ ను వదిలి వెళ్తాడు. ఆ తర్వాత అర్జున్ చుంచుమామ (జగపతి బాబు) గ్యాంగ్ లో చేరుతాడు. స్నేహితులుగా ఉన్న అర్జున్, విజయ్ లు కాస్త శత్రువులుగా మారుతారు. దాని వెనక కారణాలు ఏంటి..? వారి సమస్యలను వారు ఎలా సాల్వ్ చేశారు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

ఆరెక్స్ 100 సినిమాతో కథానాయికని విలన్ గా చేసి వారెవా అనిపించాడు డైరక్టర్ అజయ్ భూపతి. ఇక ఆ తర్వాత మహా సముద్రం కథను చాలా మందికి చెప్పి కథ బాగున్నా 3 ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చేలా చేసుకున్నాడు. ఫైనల్ గా మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పక్కా హిట్ అని బల్ల గుద్ది మరి చెప్పిన డైరక్టర్ కాన్ ఫిడెంట్ అందరిని సర్ ప్రైజ్ చేసింది.

అయితే సినిమాలో అజయ్ భూపతి అందరి క్యారక్టరైజేషన్ బాగా రాసుకున్నాడు. సినిమాలో ఏడుగురి పాత్రలు చాలా ఇంపార్టెంట్. వారి మధ్యే కథ నడుస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న వేగం.. సెకండ్ హాఫ్ లో లేదని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఉన్నా సరే అక్కడక్కడ రొటీన్ గా అనిపిస్తుంది.

సినిమాలో ప్రతి ఒక్కరి కష్టం తెర మీద కనిపిస్తుంది. సినిమా మొదలవగానే ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా సెకండ్ హాఫ్ లేకపోవడం కొద్దిగా అసంతృప్తిగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా మాత్రం దసరా బరిలో సినిమా ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైనర్ మూవీగా ఉంటుందని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

అర్జున్ పాత్రలో శర్వానంద్, విజయ్ పాత్రలో సిద్ధార్థ్ ఇద్దరు అదరగొట్టేశారు. అజయ్ భూపతి ఈ ఇద్దరి క్యారక్టర్స్ ను చాలా బాగా రాసుకున్నారు. తెర మీద శర్వానంద్, సిద్ధార్థ్ ల విశ్వరూపం కనిపిస్తుంది. మహా పాత్రలో అదితి రావు హైదరి కూడా సూపర్ గా నటించింది. మహా పాత్రకు ముందు ఎవరెవరినో అనుకున్నా సినిమా చూశాక ఆమె పర్ఫెక్ట్ అని అనుకోవాల్సిందే. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా బాగానే చేసింది. ఇక సినిమాలో జగపతి బాబు, రావు రమేష్ ల పాత్రలు కూడా హైలెట్ గా నిలిచాయి. కె.జి.ఎఫ్ రాం కూడా మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

రాజ్ తోట సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా లో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఇక చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా మూడ్ కు తగినట్టుగా అటు కెమెరా వర్క్, మ్యూజిక్ రెండు బాగా సెట్ అయ్యాయి. డైరక్టర్ అజయ్ భూపతి మంచి కథతో మహా సముద్రం తీశారు. అయితే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొద్దిగా రొటీన్ అనిపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

అక్కడక్కడ ఊహించే కథనం

బాటం లైన్ :

మహా సముద్రం.. ఇద్దరి స్నేహితుల ‘ప్రేమ’ కథ..!

రేటింగ్ : 3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All