Homeగాసిప్స్ఆ పోస్టర్ వివాదం పై ఏమన్నారంటే

ఆ పోస్టర్ వివాదం పై ఏమన్నారంటే

Maha director responds on maha first look controversy
Hansika

ఇటీవల హన్సిక నటించిన ” మహా ” పోస్టర్ విడుదలై పెద్ద వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే .  ఆ వివాదాస్పద  పోస్టర్ పై దర్శకుడు యు ఆర్ జమీల్ ఎట్టకేలకు స్పందించాడు . అయితే ఈ దర్శకుడు చెబుతున్న దాని ప్రకారం మేము కావాలని వివాదాన్ని రాజేయలేదు , వివాదం కోసం …. లేదా ఏదైనా మతాన్ని కించపరిచే ఉద్దేశం అయితే మాకు లేదు . కొత్తదనం కోసం అలా ట్రై చేసాం కానీ కుల , మతాల ప్రస్తావన తీసుకురావద్దు , నేను మానవత్వాన్ని మాత్రమే నమ్ముతాను  అని సెలవిస్తున్నాడు .

హన్సిక కు 50  వ చిత్రం ఈ ” మహా ” . అయితే జమీల్ కు ఇది మొదటి సినిమా . ఇంతకీ వివాదం సృష్టించిన పోస్టర్ ఏంటంటే ……. హన్సిక కాషాయ దుస్తులు వేసుకొని మహారాజ కుర్చీలో కూర్చొని ధూమపానం చేస్తూ ఉంది . ఆ పోస్టర్ ని మహా ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు . వివాదాన్ని రాజేశారు . అయితే ఈ పోస్టర్ ఎంత వివాదాన్ని రాజేస్తున్నప్పటికీ దర్శకుడు మాత్రం కూల్ గా సమాధానం ఇస్తున్నాడు . ఇక హన్సిక అయితే స్పందించలేదు ఇంతవరకు .

- Advertisement -

English Title: Maha director responds on maha first look controversy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All