Homeటాప్ స్టోరీస్టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ పార్టీలా?

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ పార్టీలా?

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ పార్టీలా?
టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ పార్టీలా?

బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియాతో రియా చ‌క్ర‌వ‌ర్తి లింక్స్ బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే డ్ర‌గ్ప్ క‌ల‌క‌లం టాలీవుడ్‌లోనూ మొద‌లైంది. తాజాగా న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లే ఇందుకు ప్ర‌ధాన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇటీవ‌ల బాలీవుడ్ డ్ర‌గ్స్ పార్టీల‌పై ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ పార్టీల్లో హీరోలు, హీరోయిన్‌లు డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని, ఇక్క‌డ పార్టీ అంటే అదే అని కంగ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతు కాకుండా ఓ స్టార్ హీరో డ్ర‌గ్స్‌కి ఎడిక్ట్ కావ‌డం వ‌ల్లే అత‌న్ని అత‌ని భార్య విడిచి పెట్టింద‌ని, ఆ త‌రువాత అత‌నితో తాను డేటింగ్ చేశానని, మ‌ళ్లీ ఆ స్టార్ క‌పుల్ ఇద్ద‌రు ఇప్పుడు క‌లిసి వుంటున్నార‌ని కంగ‌న చేసిన వ్యాఖ్య‌లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా వుంటే న‌టి మాధ‌వీల‌త టాలీవుడ్ డ్ర‌గ్ క‌ల్చ‌ర్‌పై కామెంట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన చాలా ప్ర‌ముఖులు పార్టీల్లో డ్ర‌గ్స్ వాడ‌తార‌ని, బాలీవుడ్ త‌ర‌హాలో టాలీవుడ్‌లోనూ డ్ర‌గ్ క‌ల్చ‌ర్ వుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీనిపై నార్కోటిక్స్ డిపార్ట‌హెంట్‌తో పాటు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా దృష్టిపెట్టాల‌ని డిమాండ్ చేసింది. మాధ‌వీల‌త వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All