Thursday, December 8, 2022
Homeటాప్ స్టోరీస్వీధి కుక్క‌ల కంటే నీచం అంటోంది!

వీధి కుక్క‌ల కంటే నీచం అంటోంది!

వీధి కుక్క‌ల కంటే నీచం అంటోంది!
వీధి కుక్క‌ల కంటే నీచం అంటోంది!

సినిమాల‌కు మించి సోష‌ల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అయిన న‌టి మాధ‌వీల‌త‌. `న‌చ్చావులే` సినిమాతో న‌టిగా ఎంట్రీ ఇచ్చినా ఆ త‌రువాత ఆ స్థాయిలో అవ‌కాశాల్ని పొంద‌లేక‌పోయింది. బీజేపీ పార్టీలో చేరిన మాధ‌వీల‌త సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ట్వీట్‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల మాస్కుల‌తో పెళ్లిళ్లు అవ‌స‌ర‌మా ? .. ఆగ‌లేక‌పోతున్నారా అంటూ టాలీవుడ్ పెళ్లిళ్ల‌పై విరుచుకుప‌డి వార్త‌ల్లో నిలిచిన మాధ‌వీల‌త తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

- Advertisement -

క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స‌హాయం చేద్దామంటూ పిలుపునిచ్చిన మాధ‌వీల‌త‌కు త‌నని ఫాలో అవుతున్న వారి నుంచే వ్య‌తిరేక‌త ఎదురైంది. మ‌మ్మ‌ల్ని సాయం అడగ‌క‌పోతే అదేదో నువ్వే చేయొచ్చు క‌దా అంటూ మాధ‌వీల‌త‌పై నెటిజ‌న్స్ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్ర‌హించిన మాధ‌వీల‌త వారిపై విరుచుకుప‌డింది. అస‌భ్య ప‌ద‌జాలంతో గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది.

త‌న‌ని కామెంట్ చేసేవారు వీధి కుక్క‌ల కంటే నీచం అని ఓ రేంజ్‌లో తిట్ల పురాణం అందుకుంది. త‌ను సాయం చేయ‌డం కోసం ఓ అభ్య‌ర్ధ‌న‌ని పోస్ట్ చేసే ముందు దీనిపై వీధి కుక్క‌ల కంటే నీచ‌మైన వాళ్లు కామెంట్లు పెడ‌తార‌ని  ఊహించాన‌ని, తాను అనుకున్న‌ట్టే జ‌రిగింద‌ని నెటిజ‌న్‌ల‌పై బూతు పురాణం అందుకుంది. దీంతో నెటిజ‌న్స్ దెబ్బ‌కు సైలెంట్ అయిపోయారు. నెటిజ‌న్స్‌ని, త‌న ఫాలోవ‌ర్స్‌ని బూతులు తిడుతున్న మాధ‌వీల‌త వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts