Homeటాప్ స్టోరీస్అమ్మా నీకు వంద‌నం.. అభివంద‌నం!

అమ్మా నీకు వంద‌నం.. అభివంద‌నం!

అమ్మా నీకు వంద‌నం.. అభివంద‌నం!
అమ్మా నీకు వంద‌నం.. అభివంద‌నం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌నుషులు…ఎవ‌రో రాక్ష‌సులు ఎవ‌రో బ‌య‌ట‌ప‌డుతోంది. మాన‌వ‌త్వం ఎంత మందిలో వుందో.. క‌ర్క‌శ మ‌న‌స్కులు ఎవ‌రో తేలిపోతోంది. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని మే 3 వ‌ర‌కు పొడిగించ‌డంతో పోలీసు, వైద్య సిబ్బంది స‌వాళ్ల‌తో కూడుకున్న విధినిర్వ‌హ‌ణ‌లో త‌ల‌మున‌క‌లైపోయిరు. కొంత మంది సైకోలు పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడుల‌కు దిగుతుంటే ఓ అమ్మ పోలీసుల‌కే ధైర్యాన్నిస్తోంది.

తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌కు ఓ నిరు పేద మ‌హిళ కూల్ డ్రింక్‌లు కొని అందిస్తున్న ఓ వీడియో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వీడియోని న‌టుడు మాధ‌వ‌న్ షేర్ చేశాడు.

- Advertisement -

ఎండ‌లు మండుతున్న వేళ త‌మ ర‌క్ష‌ణ కోసం నిలుస్తున్న పోలీసులకు ఓ మ‌హిళ కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తోంది. ఏం చేస్తావ‌ని అడిగితే తాను రోజు కూలీన‌ని, మా కోసం ప‌ని చేస్తున్న మీకు ఏదైనా చేయాల‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌ని చేశాన‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న పోలీసు సిబ్బంది అవాక్క‌య్యారు. నిన్ను చూస్తుంటే ధైర్యంగా వుంద‌మ్మా.

మీరు ఇంటి నుంచి బ‌య‌టికి రాకుంటే చాలు అంత‌కు మించి మాకు ఏమీ అక్క‌ర్లేదు అన్న పోలీసులు అమ్మా రోజూ క‌నిపించ‌మ్మా ధైర్యంగా వుంటుంద‌ని చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది. ఇలాంటి మ‌న‌సు ఎంత మందికి వుంటుంద‌ని, త‌న‌కు వ‌చ్చేది నెల‌కు 3వేలు. అలాంటి ఓ మ‌హిళ మాన‌వ‌త్వంతో సోలీసుల‌కు స‌హాయం చేయ‌డానికి బ‌య‌టికి రావ‌డం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ఆ అమ్మ చేసిన ప‌నికి భావోద్వేగానికి గురైన నెటిజ‌న్స్ అమ్మా నీకు వంద‌నం అభివంద‌నం అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All