Homeటాప్ స్టోరీస్తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న

తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న

Madhavan.R latest Tweet about his son Victoy
తండ్రిగా నేను చాలా గర్వపడుతున్న

ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వారసుడిగా నిలదొక్కుకోవడానికి అతని కుమారుడుగా, కుమార్తెగా ఆరంగేట్రం చేస్తారు. ఒక దాని తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. హిట్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా తమ నటనతో మెప్పిస్తారు, అభిమానులని సొంతం చేసుకుంటారు. ఒక్క సినిమా రంగంలోనే కాదు క్రీడా రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ నటుల కుమారులు, కుమార్తెలు. నటుడు మాధవన్ కుమారుడు కూడా అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు.

మాధవన్.ఆర్ కుమారుడు వేదాంత్.ఆర్ అంతర్జాతీయంగా తన సత్తా చాటాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వేదాంత్.ఆర్ సిల్వర్ మెడల్ (రజత పతకం) దక్కించుకున్నాడు. థాయ్ లాండ్‌లో జరుగుతున్న ఏషియన్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ పోటీల్లో 4×100మీ విభాగంలో వేదాంత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. గతంలో ఇదే థాయ్‌లాండ్ వేదికగా జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మంగ్‌లోనూ వేదాంత్ కాంస్య పతకాన్ని సాధించాడు.

- Advertisement -

14 ఏళ్ల వయస్సులోనే వేదాంత్ అంతర్జాతీయంగా సత్తా చాటుతుండటం గర్వించదగ్గ విషయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగిన జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కుమారుడు సాధించిన గొప్ప ఘనతను తండ్రిగా మాధవన్ గారు చాల సంతోషంగా పడుతున్నారు.

ఇక ట్విట్టర్ వేదికగా మాధవన్ గారు ఇలా రాసారు ‘ఆసియా క్రీడల్లో భారతదేశానికి రజత పతకం లభించింది. అంతా దేవుని దయ. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదాంత్ మొట్టమొదటి పతకం’ అని అన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ‘ఈ రోజు థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆసియా క్రీడల్లో.. వేదాంత్ భారతదేశానికి తొలి పతకం సాధించినందున సరిత, నేను గర్వంగా ఉన్నాం. మీ ఆశీర్వాదాలన్నిటికీ ధన్యవాదాలు’ అని మాధవన్ గారు రాసుకొచ్చారు.

నిజంగా వారి పృత్రోత్సవాన్ని చూసి అందరూ తెగ ప్రశంశిస్తున్నారు తండ్రికొడుకులని. ముఖ్యంగా మాధవన్ ఫ్యాన్స్ అయితే పండగలాగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఘనతని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All