Homeటాప్ స్టోరీస్అమెరికాలో హనీమూన్ లో హీరోయిన్

అమెరికాలో హనీమూన్ లో హీరోయిన్

madalasa sharma in honeymoon moodఅమెరికాలో హనీమూన్ చేసుకుంటోంది హీరోయిన్ మదాలసా శర్మ .1980 నాటి బాలీవుడ్ కింగ్ మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ వివాహం అచ్చం సినిమా పెళ్లిని తలపించిన విషయం తెలిసిందే . సరిగ్గా తాళి కట్టే సమయానికి రంగప్రవేశం చేసిన పోలీసులు మహాక్షయ్ ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించడంతో పీటల మీదే పెళ్లి ఆగిపోయింది . కట్ చేస్తే అరెస్ట్ కాబడిన మహాక్షయ్ బెయిల్ మీద వచ్చాడు తన ప్రేయసి అయిన హీరోయిన్ మదాలసా శర్మ ని పెళ్లి చేసుకున్నాడు .

పెళ్లి కావడంతో హాయిగా హనీమూన్ కి వెళ్లారు , ప్రస్తుతం అమెరికాలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు కొత్త జంట . అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నామని , హనీమూన్ బాగా జరుగుతోందని చెప్పకనే చెబుతోంది ఆ హనీమూన్ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి . తెలుగులో ఈ భామ అల్లరి నరేష్ సరసన ” ఫిట్టింగ్ మాస్టర్ ” చిత్రంలో , ఆలస్యం అమృతం చిత్రంలో నిఖిల్ సరసన నటించింది అలాగే మరో రెండు సినిమాలు ” మేము వయసుకు వచ్చాం , రామ్ లీల చిత్రాల్లో కూడా నటించింది . తెలుగు తో పాటుగా హిందీ , తమిళ్ , కన్నడ , పంజాబీ , జర్మన్ బాషలలో కూడా నటించింది మదాలసా శర్మ . ఇక ఇప్పుడేమో హాయిగా హనీమూన్ ని ఎంజాయ్ చేస్తోంది .

- Advertisement -

English Title: madalasa sharma in honeymoon mood

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All