Homeటాప్ స్టోరీస్`మ్యాడ్‌` ల‌వ్‌స్టోరీ ఫ‌స్ట్ లుక్‌!

`మ్యాడ్‌` ల‌వ్‌స్టోరీ ఫ‌స్ట్ లుక్‌!

`మ్యాడ్‌` ల‌వ్‌స్టోరీ ఫ‌స్ట్ లుక్‌!
`మ్యాడ్‌` ల‌వ్‌స్టోరీ ఫ‌స్ట్ లుక్‌!

మాధ‌వ్ చిలుకూరి, స్పంద‌న ప‌ల్లి, ర‌జ‌త్ రాఘ‌వ్‌, శ్వేతావ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం `మ్యాడ్‌`. ల‌క్ష్మ‌ణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో మోదెల టాకీస్ బ్యాన‌ర్‌పై టి. వేణుగోపాల్‌, బి. కృష్ణారెడ్డి అండ్ మిత్రులు నిర్మాత‌లుగా నిర్మిస్తున్న విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం `మ్యాడ్‌`. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని చిత్ర బృందం సోమ‌వారం విడుద‌ల చేసింది.

ప్రస్తుత జ‌న‌రేష‌న్ ని ప్ర‌తిబింబించేలా  పెళ్లి, స‌హ‌జీవ‌నంలో వున్న రెండు జంట‌ల నేప‌థ్యంలో రాబోతున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ` ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రీ లుక్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. మ‌న చుట్టూ జ‌రుగుతున్న కొన్ని జీవితాల నుంచి ప్రేర‌ణ పొంది అంతే స‌హ‌జంగా ఈ చిత్ర క‌థ‌ని చెప్ప‌డం జ‌రిగింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట‌, లివింగ్ రిలేష‌న్‌లో వున్న మ‌రో జంట జీవితాల్లో ఎలాంటి మ‌లుపులు జ‌రిగాయ‌న్నదే ఇందులో ప్ర‌ధాన క‌థాంశం. చిత్ర క‌థ‌, క‌థ‌నం, సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది.

- Advertisement -

మోడ్ర‌న్ జీ‌వితాల్ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. రెహ‌మాన్ స్కూల్ నుంచి వ‌చ్చిన మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం, ఖైలాష్ ఖేర్ ఆల‌పించిన సూఫీ సాంగ్‌ ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తుంది. మ‌ధుర ఆడియో ద్వారా ఈ చిత్ర ఆడియోని రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 14న ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేస్తున్నాం` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All