Homeటాప్ స్టోరీస్ఫిల్మ్ ఫేర్ అవార్డు ఈవెంట్ ని బహిష్కరిస్తున్నారా

ఫిల్మ్ ఫేర్ అవార్డు ఈవెంట్ ని బహిష్కరిస్తున్నారా

MAA think about ban on film fare eventప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఈనెల 16న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు , అయితే ఆ వేడుకలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బహిష్కరించనున్నట్లు తెలుస్తోంది . భారీ ఎత్తున ఈవెంట్ ని నిర్వహిస్తున్న ఈ వేడుకని ఎందుకు బహిష్కరించాలని అనుకుంటున్నారో తెలుసా ….. ….. మా నటీనటులను ఉపయోగించుకొని , వాళ్ళ స్టార్ డం తో భారీ లాభాలను తెచ్చుకుంటున్నారు అలాగే క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నారు కానీ మా అసోసియేషన్ కు ఇప్పటి వరకు ఉపయోగపడిన దాఖలాలు లేవు అని ఆరోపిస్తున్నారు .

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక నుండి సొంతంగానే ఇలాంటి వేడుకలను నిర్వహించాలని భావిస్తోందట ! ఇలా వేడుకలను నిర్వహించడం వల్ల అసోసియేషన్ కు ఆర్ధిక సహకారం అందుతుందని భావిస్తున్నారట శివాజీరాజా అండ్ కో . అయితే ఫిల్మ్ ఫేర్ అవార్డులకు క్రేజ్ ఉంది , అంతేకాదు ఈసారి చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , విజయ్ దేవరకొండ లు బెస్ట్ హీరోల కేటగిరీ లలో పోటీ పడుతున్నారు కాబట్టి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ ని మా బాయ్ కాట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు . కానీ ఆలోచన మాత్రం చేస్తున్నారట అంతేకాదు ఇప్పటికే చాలామంది కి ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ కు హాజరు కావద్దని మెసేజ్ లు కూడా పంపించారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All