Homeటాప్ స్టోరీస్విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌ద్దుతు తెలిపిన `మా`!

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌ద్దుతు తెలిపిన `మా`!

విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌ద్దుతు తెలిపిన `మా`!
విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు మ‌ద్దుతు తెలిపిన `మా`!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఓ వెబ్ సైట్ ఫేక్ న్యూస్‌ని ప్ర‌చారం చేసి విష‌యం చిమ్మిన విష‌యం చిమ్మిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు వెబ్‌సైట్‌పై విజ‌య్‌దేవ‌ర‌కొండ నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా యావ‌త్ ఇండ‌స్ట్రీ క‌దిలింది. మేమున్నామంటూ ముందుకొచ్చింది. తాజాగా `మా` అసోసియేష‌న్ కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌మ మ‌ద్ద‌తును తెలిపింది. ఈ సంద‌ర్భంగా `మా` యాక్టింగ్ ప్రెసిడెంట్ బెన‌ర్జి స్పందించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ` మంచి కార్య‌క్ర‌మం చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కొంత మంది బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. లాక్ డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు ఆస‌రాగా నిలిచే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో పాటు మ‌న కోసం సీసీసీకి విరాళం ఇచ్చారు. సొంతంగా చారిటీ ని ప్రారంభించి ఫండ్స్ పోగుచేసి త‌న వంతు సాయంగా పేద‌ల‌కు ఆస‌రాగా  నిలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్య‌క్ర‌మం చేస్తున్న ఆయ‌న‌పై కొంత మంది బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వారిని నేను నిల‌దీస్తున్నా అస‌లు మీరెవ‌రు.. మా ఆర్టిస్టుల ఇష్టం. ఎవ‌రికి సాయం చేయాల‌నేది మా ఇష్టా ఇష్టాల‌పై ఆధాపడి వుంటుంది.  దీని గురంచి స‌మాధానం ఎవ‌రికి చెప్పాలి.. ఎవ‌రికి చెప్ప‌కూడ‌దు అనేది మా ఇష్టం` అన్నారు.

- Advertisement -

కొన్ని వెబ్ సైట్స్ చేస్తున్న నిరాధార‌మైన ఆరోప‌ణ‌లతో చాలా ఇబ్బందుల‌కి గురి అవుతున్నాం. బ‌య‌టికి రండి అని అన‌డం ఇదేం దొంగ‌త‌నం కాదు. ఈ త‌ప్పుడు వార్త‌లు రాసే వారికి ధైర్యం వుంటే ముందు మీరు బ‌య‌టికి వ‌చ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడండని, ఇక‌పై ఇలాంటి వార్త‌లు రాస్తే ఊరుకోబోమ‌ని`స్ప‌ష్టం చేశారు.
సినీ వెబ్ సైట్స్‌, ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కి సినీ ప‌రిశ్ర‌మ‌కి ఇంట‌ర్న‌ల్ లింక్ వుంద‌ని, అంద‌రం అన్న‌ద‌మ్ములం..తామంతా ఒక ఫ్యామిలీ అని పేర్కొన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు మీడియా స‌పోర్ట్ త‌ప్ప‌క కావాల‌ని న్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All