Homeటాప్ స్టోరీస్'మా' చీలిక.. మంచు విష్ణుకి పెద్ద సవాల్..!

‘మా’ చీలిక.. మంచు విష్ణుకి పెద్ద సవాల్..!

MAA Separation Manchu Vishnu Challenges
 

మా కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు గెలిచిన ఆనందంలో ఉండగా ఆయనముందు పెను సవాళ్లు వచ్చేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు రసవత్తరమైన పోటీలో మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉన్నా సరే ఓటమి పాలయ్యాడు ప్రకాష్ రాజ్. మంచు విష్ణు గెలిచిన ప్రకటన రావడమే ఆలస్యం ప్రకాష్ రాజ్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మరోపక్క ప్రకాష్ రాజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి రాజీనామా చేస్తున్నా అని అన్నారు. ఇదేకాదు ఈసీ మెంబర్స్ రిజల్ట్స్ విషయంలో మాజీ ప్రెసిడెంట్ నరేష్ పై ఆరోపణలు చేస్తూ మరో మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు రెడీ అన్నట్టు చెప్పారు. అయితే మంచు విష్ణు వీళ్లతో మాట్లాడి వీరి సభ్యత్వాన్ని రద్దు చేసుకునే విషయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తానని అన్నారు.

- Advertisement -

కాని అదంత ఈజీగా జరిగే పనిగా కనిపించట్లేదు. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఈ అసంతృప్త సభ్యులందరిని మచ్చిక చేసుకుని వారి సభ్యత్వాన్ని రద్దు చేసుకోకుండా చూసుకోవాలి. అలా కాకుంటే మా సభ్యత్వానికి రాజీనామా చేసే సభ్యుల సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేయాల్సిన ప్రధాన కర్తవ్యం ఎవరైతే నిరాశ.. అసంతృప్తిగా ఉంటారో వారిని ఒప్పించి మునుపటి వాతావరణం కొనసాగించేలా చూడాలి. లేదంటే అతని అధ్యక్ష పదవికి పెద్ద మచ్చ లానే ఏర్పడుతుంది. అంతేకాదు కొందరు ‘మా’ సభ్యులు మాకంటూ మరో ‘మా’ కావాలని అంటుండటం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. ఇలా గొడవ జరిగినప్పుడల్లా ‘మా’లో చీలిక విషయం తెర మీదకు రావడం కామనే అయినా ఈసారి దాని ఇంప్యాక్ట్ బాగా కనిపిస్తుందని అర్ధమవుతుంది. మరి మంచు విష్ణు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All