Homeటాప్ స్టోరీస్'మా' కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు..!

‘మా’ కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు..!

MAA New President is Manchu Vishnu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా ఫలితాల్లో అది కనిపించలేదు. అధ్యక్షుడిగా మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ప్రకాష్ రాజ్ పై గెలిచారని తెలుస్తుంది. మంచు విష్ణు ప్యానల్ నుండి 7 ఈసీ మెంబర్స్ గా గెలిచారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గెలిచాడు. మా అధ్యక్ష పదవి పోటీలో ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు పోల్ అవగా.. మంచు విష్ణుకి 381 ఓట్లు పోల్ అయ్యాయి. 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలిచారు.

- Advertisement -

ఇక ఇలా కౌంటింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయో లేదో మంచు ఫ్యాన్స్ హంగామా మొదలైంది. మోహన్ బాబు జిందాబాద్.. విష్ణు బాబు జిందాబాద్ అని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక గెలిచిన సభ్యులు సం యమనం పాటించాలని సూచించారు మోహన్ బాబు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All