Homeటాప్ స్టోరీస్'మా' ఫైట్.. వార్ వన్ సైడ్ అయ్యిందా.. ప్రకాష్ రాజ్ కాకుంటే పోటీ ఎవరు..?

‘మా’ ఫైట్.. వార్ వన్ సైడ్ అయ్యిందా.. ప్రకాష్ రాజ్ కాకుంటే పోటీ ఎవరు..?

MAA Elections War Oneside If Prakash Raj not a Candidate What will Results

మా ఎలక్షన్స్ కొత్త సమీకరణాలను తీసుకువచ్చింది. ఓ పక్క తెలుగు అసోసియేషన్ కు తెలుగు వాళ్లకి ఉండే అహత లేదా మేము మేము తెలుగు వాళ్లం అంతా ఒకటి అనేలా ప్రచారం చేసిన వీళ్లు ఇండస్ట్రీలో వర్గ పోరు ఉందని స్పష్టంగా కనిపించేలా చేశారు. ఓటు వేసే వ్యక్తి పర భాష వాడైనా పర్లేదు కాని పోటీలో ఉండటానికి మాత్రం తెలుగు వాడే కావాలా అన్న ప్రకాష్ రాజ్ కామెంట్స్ కూడా మా సభ్యులకు బాగా నాటాయని చెప్పొచ్చు.

- Advertisement -

ఇదిలాఉంటే మా అధ్యక్ష పోటీలో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఫైట్.. కేవలం వార్ వన్ సైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్క మెగా కాంపౌండ్ మాత్రమే ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా నిలవగా మిగతా వారంతా తెలుగు వాదంతో అతనికి వ్యక్తిరేకం అయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ కాకుండా మంచు విష్ణుకి ఎవరైనా తెలుగు వారు పోటీగా నిలిచుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ఆలోచిస్తున్నారు.

అలా జరిగినా కూడా ఈసారి మంచు విష్ణు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి మరి రంగంలో దిగాడు. అందుకే ఎక్కడెక్కడి వారినో ఫ్లైట్ టికెట్స్ వేయించి మరి మా ఓటింగ్ లో పాల్గొనే చేశాడు. మొత్తానికి మా ఫైట్ లో మంచు విష్ణుకి పోటీగా ప్రకాష్ రాజ్ బలమైన ప్రత్యర్ధిగా అనిపించినా అతని వల్ల లోకల్ నాన్ లోకల్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఒకవేళ లోకల్ పర్సన్ అదే తెలుగు సభ్యుడు నిలుచుని ఉంటే ఎలా ఉండేది అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉంటే మంచు విష్ణు మా మేనిఫెస్టో లో చెప్పిన మాటలన్ని చేస్తే మాత్రం అతనికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All