Homeటాప్ స్టోరీస్ప్రకాష్ రాజ్ కే మా 'మెగా' సపోర్ట్.. మరోసారి బల్లగుద్ది చెప్పిన నాగ బాబు..!

ప్రకాష్ రాజ్ కే మా ‘మెగా’ సపోర్ట్.. మరోసారి బల్లగుద్ది చెప్పిన నాగ బాబు..!

MAA Elections Mega Support for Prakash Raj

మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ఒంటరివాడయ్యాడు.. మంచు విష్ణు ప్యానల్ తరపున మాట్లాడే వారు ఎక్కువయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున మాట్లాడే వారి సంఖ్య తక్కువైంది. ప్రకాష్ రాజ్ కు కావాల్సిన సపోర్ట్ లేదని అనుకుంటున్న టైం లో కరెక్ట్ గా దిగాడు మెగా బ్రదర్ నాగ బాబు. మా ఎన్నికల్లో మా మెగా సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని మరోసారి బల్లగుద్ది మరి చెప్పారు నాగబాబు.

- Advertisement -

ప్రకాష్ రాజ్ కమ్యూనిష్ట్.. తాను బీజేపీ సానుభూతిపరుడని.. అయినా సరే ఈసారి ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ అయితేనే పర్ఫెక్ట్ అని అంటున్నారు నాగబాబు. అన్నయ్య చిరంజీవితో క్లోజ్ గా ఉండే ప్రకాష్ రాజ్ అంటే తనకు మంచి సన్నిహిత్యం ఉంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారని తెలిసినప్పుడు.. తాను ఎవరికైనా మాట ఇచ్చానా అని అన్నయ్య తనని అడిగారని.. దానికి లేదని చెప్పానని అన్నారు. అన్నయ్య ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుందని.. అతని మేధస్సు.. మంచి మనసున్న వ్యక్తి అని అన్నయ్య అన్నారని గుర్తుచేశారు.

ఇండియా టుడూ కాన్ క్లే లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామితో ప్రకాష్ రాజ్ చర్చించిన తీరు తనకు బాగా నచ్చిందని.. ఒక నటుడు రాజకీయ నాయకుడి చర్చకు వళ్లడం అంత సులభం ఆదు.. అది సుబ్రహ్మణ్య స్వామి లాంటి రాజకీయ నాయకుడితో చర్చకు వెళ్లడం సులభం కాదని అన్నారు నాగబాబు.

ఈ సందర్భంగా మంచు విష్ణు ని ఉద్దేశించి కూడా మాట్లాడారు నాగ బాబు. ప్రకాష్ రాజ్ నువ్వు ఇండస్ట్రీ వైపా..? పవన్ కళ్యాణ్ వైపా అని ఛాలెంజ్ చేశాడు.. ఈ ప్రశ్నేంటి విష్ణు.. ప్రకాష్ రాజ్ మరో రాష్ట్రం వాడు కావొచ్చు కాని కళ్యాణ్ బాబు తెలుగు వాడు కాదా..? తనది తెలుగు ఇండస్ట్రీ కాద.? ఏం ఆలోచిస్తున్నారో.. ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు అన్నారు నాగ బాబు.

తాను ప్రకాష్ రాజ్ కు మద్ధతు ఇస్తె ఎప్పుడో జరిగిన మా అసొసియేషన్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు ఎత్తుతారురా నాయనా అంటూ మాట్లాడారు నాగబాబు. మా అసోసియేషన్ కి 170 గజాల స్థలం ఉంది. అక్కడే డైరక్టర్స్ అసోసియేషన్ కూడా ఉంది. తాము కొన్నప్పుడు ఆ స్థలానికి 90 లక్షలు అయింది. దాన్ని శివాజిరాజా వాళ్లు అమ్మేశారు. దాని నరేష్ దగ్గర నుండి ఆన్సర్ లేదు. ఎందుకంటే దానికి సంతకం పెట్టింది నరేష్ కాబట్టే. దీని గురించి మోహన్ బాబు అన్నయ్య తనని అడిగారు.. నన్ను అడగడం ఎందుకు మీకు కృష్ణుడిలా కాపలా కాస్తున్న నరేష్ ను అడగొచ్చు కదా అన్నారు. ఇక మా ఎలక్షన్స్ కోసం ఆర్టిస్టులకు మొదటిసారి డబ్బు ఆశ చూపుతున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజమో తనకు తెలియదు. ఇప్పటికి అందరికి పదివేలు ఇచ్చాం.. త్వరలో మరికొంత ఇవ్వబోతున్నాం అని మాట్లాడుతున్నారట. మా అసోసియేషన్ మసకమారుతుంది అని అప్పట్లో ఎందుకో అన్నాను.. కాని ఇప్పుడు చెబుతున్నాను మా మసకబారుతుంది అని నాగ బాబు ఫైర్ అయ్యారు.

మొత్తానికి ఈ టోటల్ ఎపిసోడ్ ద్వారా మరోసారి ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉందని.. ఉంటుందని చెప్పాడు నాగబాబు. మరి మెగా ఫైట్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All