Homeటాప్ స్టోరీస్ఊపేస్తున్న `ఏవో ఏవో క‌ల‌లే..`!

ఊపేస్తున్న `ఏవో ఏవో క‌ల‌లే..`!

ఊపేస్తున్న `ఏవో ఏవో క‌ల‌లే..`!
ఊపేస్తున్న `ఏవో ఏవో క‌ల‌లే..`!

నాగచైత‌న్య హీరోగా న‌టిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, సుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేసింది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన లిరిక‌ల్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. సాయి ప‌ల్ల‌విపై చిత్రీక‌రించిన ఫోక్ సాంగ్ `సారంగ‌ద‌రియా.. ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి `ఏవో ఏవో క‌ల‌లే..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని స్టార్ హీరో మ‌హేష్ విడుద‌ల చేశారు. నాగాచైత‌న్య‌, సాయి ప‌ల్ల‌విపై శేఖ‌ర్ మాస్ట‌ర్ నేతృత్వంలో చిత్రీక‌రించిన ఈ పాట‌ మెలోడీ ప్ర‌ధానంగా సాగుతూనే సాయి ప‌ల్ల‌వి, చైల అదిరిపోయే స్టెప్పుల‌తో ఆకట్టుకుంటోంది.

- Advertisement -

శేఖ‌ర్ క‌మ్ముల చిత్రానికి తొలిసారి భాస్క‌రభ‌ట్ల రాసిన పాట ఇది. ఈ పాట‌కు శ్యామ్ ప‌వ‌న్ సీహెచ్ సంగీతం అందించ‌గా, జోనితా గాంధీ, న‌కుల్ అభ్యాంక‌ర్ ఆల‌పించారు. ప్ర‌త్యేకంగా రెయిన్ సాంగ్‌గా చిత్రీక‌రించిన ఈ పాట విడుద‌లైన గంట‌ల వ్య‌వ‌ధిలోని మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి యూట్యూబ్‌ని ఊపేస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట కూడా రికార్డుల మోత మోగించ‌డం ఖాయం అంటున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All