Homeటాప్ స్టోరీస్అక్టోబర్ వరకూ వేచి చూడనున్న లవ్ స్టోరీ

అక్టోబర్ వరకూ వేచి చూడనున్న లవ్ స్టోరీ

love story to wait until october
love story to wait until october

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ముందు థియేటర్లలోనే విడుదలవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఓటిటి విడుదలకు ఓటు వేసింది. త్వరలోనే ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో టక్ జగదీష్ తో పాటు విడుదలవ్వాల్సిన లవ్ స్టోరీ పరిస్థితి ఏంటి?

ఆ మధ్య లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ తెలుగు సినిమా నిర్మాతలను ఓటిటి రిలీజ్ కు వెళ్లవద్దని, అక్టోబర్ వరకూ వేచి చూడమని చెప్పాడు. మరి అలా అందరికీ సలహా ఇచ్చిన సునీల్ నారంగ్ తన సినిమా విషయంలో మాత్రం ఎలా చేస్తాడు? అందుకే లవ్ స్టోరీ విషయంలో కూడా అక్టోబర్ వరకూ వేచి చుడనున్నాడు ఈ నిర్మాత.

- Advertisement -

అప్పటివరకూ విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనుకోవట్లేదు. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All