Homeటాప్ స్టోరీస్'అనగనగా ఓ ప్రేమకథ ' లోని 'లవ్ అంటే నేనేలే' పాట ను...

‘అనగనగా ఓ ప్రేమకథ ‘ లోని ‘లవ్ అంటే నేనేలే’ పాట ను విడుదల చేసిన సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం

'LOVE ANTE NENELE' SONG LAUNCHED BY DIRECTOR SHRI 'MANIRATNAM' విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ‘లవ్ అంటే నేనేలే’ సాంగ్ ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి.

- Advertisement -

తమ చిత్రంలోని పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ

 

నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All