Homeటాప్ స్టోరీస్ఎన్నికల నగారా మోగింది

ఎన్నికల నగారా మోగింది

Lok sabha election 2019 schedule కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది . దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది . మొత్తం 7 దశలలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి .  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లలో మొదటి దశలోనే ఎన్నికలు జరుగనున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి , ఇక తెలంగాణ లో మాత్రం నాలుగు  నెలల కిందటే అసెంబ్లీ కి ఎన్నికలు జరిగినందున 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి ఏప్రిల్ 11న .

 

- Advertisement -

మొదటి దశలో ఏప్రిల్ 11న , రెండో దశలో ఏప్రిల్ 18న , మూడో దశలో ఏప్రిల్ 23న , నాలుగో దశలో ఏప్రిల్ 29 న , ఐదో దశలో మే 6న , ఆరో దశలో మే 12న , ఏడో దశలో మే 19న ఎన్నికలు జరుగనున్నాయి . ఇక ఓట్ల లెక్కింపు మాత్రం మే 23న జరుగుతుంది ఫలితాలు కూడా అదే రోజున వెలువడనున్నాయి . మే నెలాఖరున కొత్త ప్రధాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు . అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది అది చంద్రబాబు ప్రభుత్వమా ? లేక జగన్ ప్రభుత్వమా ? అన్నది మే 23న తేలనుంది .

English Title : Lok sabha election 2019 schedule

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All