Homeటాప్ స్టోరీస్'మా' ఎలక్షన్స్.. నాన్ లోకల్.. ఓటుకి ఓకే.. పోటీకి నాట్ ఓకే..!

‘మా’ ఎలక్షన్స్.. నాన్ లోకల్.. ఓటుకి ఓకే.. పోటీకి నాట్ ఓకే..!

Local and Non Local Issue for MAA Elections

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే కేవలం తెలుగు నటీనటులు మాత్రమే కాదు. చాలావరకు తెలుగు నటీనటులు ఉన్నా ఇతర భాషా ఆర్టిస్టులు కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. స్టార్స్ గా పరిగణించబడే కథానాయికలందరు ఇతర భాషల నుండి.. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే. వీరికి లోకల్.. నాన్ లోకల్ అనే ట్యాగులు వేయలేం.

- Advertisement -

అసలు నటుల విషయంలో లోకల్.. నాన్ లోకల్ అనేది ఏదీ ఉండదు.. ఉండకూడదు కూడా.. కాని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల టైం లో మాత్రం మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ పై ప్రత్యర్ధులు చేసిన దాడి నాన్ లోకల్ అనే. ప్రకాష్ రాజ్ యూనివర్సల్ స్టార్. అతను అన్ని భాషల్లో నటించాడు.. నటిస్తున్నాడు. అలాంటి ప్రకాష్ రాజ్ ను ఒక ప్రాంతానికి చెందినవాడు అని చెప్పడం కష్టం.

మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ఓటమికి ఈ లోకల్.. నాన్ లోకల్ టాక్ బాగా దెబ్బ వేసిందని చెప్పొచ్చు. తెలుగు నటుల్లో చాలా వరకు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం విశేషం. ఇదిలాఉంటే మా కోసం ఇతర భాషల నటీనటులను పిలిపించుకుని మరి ఓట్లు వేయించుకునే అవకాశం ఉన్నప్పుడు అలాంటి నాన్ లోకల్ పర్సన్ పోటీగా నిలబడితే తప్పేంటి అన్నది ఆడియెన్స్ పాయింట్.

ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపుకి ఆ నాన్ లోకల్ ఓట్లు కూడా కొంతమేర ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. మరి పోటీకి పనికిరాని నాన్ లోకల్ కాండిడేట్స్ ఓటింగ్ కు ఎలా పిలినట్టు అని కొందరు మాట. నా ఆధార్ ఇక్కడే ఉంది.. నేను తెలుగు నటుడిని బాబోయ్ అని ప్రకాష్ రాజ్ ఎంతమొత్తుకున్నా.. లేదు లేదు నువ్వు నాన్ లోకల్ యువార్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మా ప్రెసిడెంట్ అని అతన్ని పక్కన పెట్టారు. ఈ విషయంలో హర్టైన ప్రకాష్ రాజ్ తను పొందిన అవమాన భారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All