Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడికి ఇబ్బందులు తప్పినట్లేనా

శైలజారెడ్డి అల్లుడికి ఇబ్బందులు తప్పినట్లేనా

line clear for shailajareddy alluduశైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అనుకున్న పనులు ఏవి సకాలంలో జరగడం లేదు , వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి పనులన్నీ . అయితే తాజా పరిస్థితి చూస్తుంటే అన్ని ఇబ్బందులను శైలజారెడ్డి అల్లుడు అధిగమించినట్లే ! అని అంటున్నారు . శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ ని అనుకుంటే కుదరలేదు సింగిల్ సాంగ్ అనుకుంటే అదీ కుదరలేదు …… విడుదల ఆగస్టు 31న అని ప్రకటిస్తే అది కూడా వీలుకాలేదు దాంతో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది .

అక్కినేని వంశాభిమాని చనిపోవడం, కేరళ వరదలు , నందమూరి హరికృష్ణ దుర్మరణం ఇలా వరుసపెట్టి సంఘటనలు జరగడంతో శైలజారెడ్డి అల్లుడు వాయిదాపడింది . మొత్తానికి ఇప్పుడు వరదలు లేవు , హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి కాబట్టి ఇక శైలజారెడ్డి అల్లుడు కి అడ్డంకులన్నీ తొలగిపోతే సెప్టెంబర్ 13న విడుదల అవడం ఖాయం . ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గీత గోవిందం తప్ప మరో సినిమా ఏది లేదు కాబట్టి శైలజారెడ్డి అల్లుడు వసూళ్ల వర్షం కురిపించినా ఆశ్చర్యం లేదు .

- Advertisement -

English Title: line clear for shailajareddy alludu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All