Homeటాప్ స్టోరీస్ఆ బడ్జెట్ లో నిఖిల్ అండ్ కో వల్ల అవుతుందా?

ఆ బడ్జెట్ లో నిఖిల్ అండ్ కో వల్ల అవుతుందా?

limited budget proposed for karthikeya 2
limited budget proposed for karthikeya 2

యంగ్ హీరో నిఖిల్ కెరీర్ ప్రస్తుతం ఏమంత బాలేదు. ఈ మధ్య నిఖిల్ నటించిన సినిమాలేవీ అంతలా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన రీమేక్ అర్జున్ సురవరం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నెలలకు నెలలు వాయిదా పడి మొత్తానికి నవంబర్ 29న విడుదల కానుంది. అప్పట్లో ఈ సినిమాపై బజ్ బాగానే ఉండేది. అప్పుడు విడుదల చేసిన ట్రైలర్ కూడా జనాలను ఆకట్టుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సంవత్సరానికి పైగా వాయిదా పడింది. మొదట్లో ఈ చిత్రానికి ముద్ర అన్న టైటిల్ పెట్టగా, దాన్ని ఎవరో కాజేసి సినిమాను కూడా విడుదల చేసేసుకున్నారు. దీంతో టైటిల్ మార్చక తప్పని పరిస్థితి. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన అతనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కానీ నిఖిల్ ఇంకా కొత్త సినిమాను మొదలుపెట్టలేదు.

నిజానికి నిఖిల్ అర్జున్ సురవరం తర్వాత కార్తికేయ 2 చిత్రాన్ని మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో కార్తికేయ కూడా ఒకటి. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కార్తికేయ 2 వంతు వచ్చింది. నిఖిల్ కు కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినా కార్తికేయ 2 ని పట్టాలెక్కించలేదు. దీనికి బడ్జెట్ ఇబ్బందులు తలెత్తాయి. మొదటి భాగాన్ని తెరకెక్కించిన చందూ మొండేటి రెండో భాగానికి కూడా దర్శకత్వం చేస్తాడు. అయితే మొదట ఈ చిత్రానికి 20 కోట్ల బడ్జెట్ ప్లాన్ వేసాడు చందూ మొండేటి. 20 కోట్లు చూసి మొదట నిర్మిద్దామనుకున్న ఆసియన్ సినిమాస్ వారు వెనక్కి తగ్గారు. నిఖిల్ రేంజ్ కు ఆ బడ్జెట్ చాలా ఎక్కువని వారు ఫీల్ అయ్యారు. దాంతో కార్తికేయ 2 కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

- Advertisement -

రీసెంట్ గా మళ్ళీ కార్తికేయ 2 పట్టాలెక్కనుందని సమాచారం. 20 కోట్లు అంటే నిర్మాతలు బెదిరిపోతున్నారు కాబట్టి చందూ మొండేటి ఈ చిత్రాన్ని 15 కోట్లలో నిర్మించి ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ ఆఫర్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వచ్చారు. 15 కోట్లలో చేస్తామంటే సినిమా నిర్మించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. దీంతో మళ్ళీ కార్తికేయ 2 పనులు ముందుకు కదిలాయి. ఇక్కడిదాకా బానే ఉంది కానీ చందూ మొండేటి నిజంగా 15 కోట్లలో సినిమాను నిర్మించగలడా? సవ్యసాచి లాంటి సాధారణ సినిమాకే 30 కోట్లు మైత్రి వాళ్ళ చేత పెట్టించాడు. ఇక కార్తికేయ 2 సిజి వర్క్స్ ఎక్కువగా ఉన్న చిత్రం. పైగా కథ ప్రకారం ఇండియాలోని వివిధ చోట్ల షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య చందూ కార్తికేయను మించిన సినిమా అందించగలడా??.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All