Homeటాప్ స్టోరీస్పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి లారెన్స్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి లారెన్స్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి లారెన్స్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కి లారెన్స్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

డ్యాన్స్ మాస్ట‌ర్‌గా, ద‌ర్శ‌కుడి, హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు రాఘ‌వ లారెన్స్‌. `కాంచ‌న‌` సిరీస్ చిత్రాల‌తో థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన లారెస్స్ గ‌త వ‌రుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తున్నారు. థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు త‌న‌దైన మార్కుని జోడించి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా థ్రిల్ల‌ర్ చిత్రాల్ని అందిస్తూ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంటున్నారు. త‌న‌సినిమాల ద్వారా వ‌చ్చే డ‌బ్బుని సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్న రాఘ‌వ లారెన్స్‌కు త‌లైవ‌ర్ త‌మిళ సూప‌ర్‌స్టార్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

ర‌జ‌నీ పార్టీ పెడుతున్నారంటే ముందు నుంచి స‌పోర్ట్ చేస్తున్న వ్య‌క్తి రాఘ‌వ లారెన్స్. అయితే ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రంపై త‌మిళ‌నాడులో కొంత మంది లొక‌ల్. నాన్ లోక‌ల్ అనే ఫీలింగ్‌ని రెచ్చ‌గొడుతూ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా నుంచి చాలా మంది వ్య‌తిరేకిస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే తాజాగా నామ్ త‌మిళ‌ర్ క‌చ్చి ఛీఫ్ కో ఆర్డినేట‌ర్ సీమాన్ సూప‌ర్‌స్టార్ ర‌జనీ రాజ‌కీయ అరంగేట్రంపై విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చినీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్య‌లపై ఆగ్ర‌హించిన రాఘ‌వ లారెన్స్ నామ్ త‌మిళ‌ర్ క‌చ్చి ఛీఫ్ కో ఆర్డినేట‌ర్ సీమాన్‌పై విరుచుకుప‌డ్డారు. `రాజ‌కీయాలు రెండు ర‌కాల‌ని, ఒక‌టి మంచి చేయ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తే మ‌రొక‌టి చెడు కోస‌మే ప‌నిచేస్తుంటుంద‌ని, ఈ విష‌యం తెలుసుకుని సీమాన్ మాట్లాడాల‌ని, ఎట్టిప‌రిస్థితుల్లోనూ హ‌ద్దులు దాటి మాట్లాడ‌రాద‌ని ఘాటుగా హెచ్చ‌రించారు.

- Advertisement -

ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌నే ల‌క్ష్యంతోరాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారిని ఎలాంటి కారణం లేకుండా విమ‌ర్శించ‌డం మంచిది కాద‌ని, ప్ర‌త్యేకంగా పనిగ‌ట్టుకుని టార్గెట్ చేయ‌డాన్ని నేను స‌మ‌ర్ధించ‌న‌ని చెప్పుకొచ్చారు. రాజ‌కీయాలు అనేవి ఓ ర‌న్నింగ్ రేస్‌. నిజ‌మైన ర‌న్న‌ర్ వ్యక్తిగ‌త విమర్శ‌ల‌కు దిగ‌ర‌ని, పోటీ లేని ప‌రుగు పందెంలో విజేత‌ల‌ని నిర్ణ‌యించ‌లేర‌ని, మీరే త‌మిళ త‌ల్లికి పుట్టిన‌ట్టు చెబుతున్నార‌ని, అయితే మిగ‌తా వారంత ఇంగ్లీష్ వాళ్ల‌కు పుట్టిన‌ట్టా?` అని నామ్ త‌మిళ‌ర్ క‌చ్చి ఛీఫ్ కో ఆర్డినేట‌ర్ సీమాన్‌పై విరుచుకుప‌డ్డారు. దీంతో త‌మిళనాట ర‌చ్చ మొద‌లైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All